ప్రభాస్ పెళ్లిపై తాజా కామెంట్లు!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇన్ టాలీవుడ్ అనగానే గుర్తొచ్చే మొదటిపేరు ప్రభాస్. ఇటీవల బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే విషయంపై చాలా వార్తలు వినిపించాయి.  అయితే ప్రభాస్ సినిమాల మీద చూపుతున్న ఆసక్తిని పెళ్లి మీద మాత్రం చూపడం లేదు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభాస్ పెళ్లికి ఎప్పుడు ఓకే చెబుతాడో అంటూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు అతని కుటుంబసభ్యులు. ఆ మద్య ప్రభాస్ వివాహం విషయంలో సోషల్ మీడియాలో రక రకాల రూమర్లు వచ్చాయి. 

ఓ ఇంజనీరింగ్ అమ్మాయితో ఏకంగా ఎంగేజ్ మెంట్ అయినట్లు వార్తలు హల్ చల్ చేశాయి. ఇక ప్రభాస్ పెళ్లికి సిద్ధమని చెప్పిన వెంటనే సంబంధాలు చూడటం ప్రారంభిస్తామని అన్నారు క‌ృష్ణంరాజు. అయితే వివాహం విషయంలో మాత్రం జాతకాలను కచ్ఛితంగా చూస్తామని, ఇద్దరి జాతకం కుదిరితేనే పెళ్లి చేస్తామని ఆయన చెప్పారు. మరి ప్రభాస్ జాతకానికి సరిపోయే ఆ లక్కీ లేడి ఎక్కడుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.