HomeTelugu Big Storiesయువతి పాటకు కేటీఆర్‌ ఫిదా

యువతి పాటకు కేటీఆర్‌ ఫిదా

Ktr mesmerized with young t

తెలంగాణలోని మారుమూల పల్లెటూరికి చెందిన ఓ యువతి పాడిన పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ఆమె గాత్రం సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌లను మంత్రముగ్ధులను చేసింది. తాము భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే షోల‌లో ఆమెకు అవకాశం ఇస్తామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అధ్భుత గాయని. తన పాటకు ఫిదా అయినా సురేంద్ర తిప్పరాజు అనే నెటిజన్‌.. ఆ వీడియో ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు షేర్‌ చేశాడు. ‘మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో ఓ ఆణిముత్యం దొరికింది. శ్రావ‌ణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయ‌ని స్వ‌రం మైమ‌రిపించేలా ఉంది. ఆమె ట్యాలెంట్‌కు మీ స‌హ‌కారంతో పాటు మీ ఆశీస్సులు అవ‌స‌రం’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే శ్రావణి పాడిన ‘రేలా రే రేలా రే’ అనే పాట‌ను ట్వీటర్‌లో షేర్‌ చేశాడు.

ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ.. శ్రావ‌ణిలో అద్భుత‌మైన ట్యాలెంట్ ఉందంటూ కేటీఆర్ ప్ర‌శంసించారు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు తమ‌న్, దేవీ శ్రీప్ర‌సాద్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. దీనిపై తమన్‌ స్పందిస్తూ.. శ్రావణి అద్భుతమైన సింగర్‌ అని మెచ్చుకున్నాడు. ఇక డీఎస్పీ ఆమె స్వరానికి ఫిదా అయ్యానని చెప్పాడు. ఇంతటి ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకొచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాము భ‌విష్య‌త్‌లో నిర్వ‌హించే షోల‌లో శ్రావ‌ణికి త‌ప్ప‌కుండా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని దేవీ శ్రీప్ర‌సాద్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!