బాలయ్యకు విలన్ దొరికేశాడు!

ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ సినిమా చేస్తోన్న బాలయ్య ఈ సినిమా తరువాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ‘రెడ్డి గారు’ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనే విషయంలో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అతడు మరెవరో కాదు.. శ్రీకాంత్. 
ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క బాబాయ్ తరహా పాత్రలు పోషిస్తోన్న శ్రీకాంత్ ఇప్పుడు బాలయ్య కూడా పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు.
తన కెరీర్ ఆరంభంలో శ్రీకాంత్ విలన్ పాత్రలు పోషించాడు. ‘వారసుడు’,’సీతారత్నం గారి అబ్బాయి’ వంటి సినిమాల్లో విలన్ గా అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత హీరోగా మారి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి విలన్ గా టర్న్ తీసుకోవడం విశేషమనే చెప్పాలి. అందులోనూ బాలయ్య సినిమా అనేసరికి కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. మరి శ్రీకాంత్ విలన్ గా మరోసారి తన ప్రతిభను చాటుతాడేమో చూడాలి!