HomeTelugu Newsబీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ: కేటీఆర్‌

బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ: కేటీఆర్‌

8 15
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ వేములవాడలో ప్రసంగించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడైనా ఆలోచన చేశాయా? అనే విషయాన్ని ఆచోచించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని కేటీఆర్‌ అన్నారు. రూ.218 కోట్ల నిధులు కేటాయించామని.. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ రకాల పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రం మొత్తం అబ్బురపడేలా రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వని బీజేపీకు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలోని పట్టణాలను దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పనిచేసే నాయకులకే ఓటు వేయాలని.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పని చేయకపోతే వారిని తొలగిస్తామని కేటీఆర్‌ తేల్చి చెప్పారు.

8a

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వస్తామనేవారిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల అంటే ఉరిశాల అని ఒకప్పుడు పేరుండేదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పాలనలో సిరిసిల్ల నేతలన్నలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. ఎన్నికలు రాగానే కొందరికి కులం, మతం గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి రూ.10 వేల కోట్లు అందుతున్నాయని అన్నారు. సిరిసిల్లలోని 39 స్థానాల్లో ఇప్పటికే 4 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని.. మిగిలిన 35 స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌ను గెలిపించే బాధ్యత ప్రజలదేనని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో సిరిసిల్లకు రైలు సౌకర్యం తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. రాయనిచెరువు ప్రాంతంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని గుర్తు చేశారు. సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు. బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు ఓటు వేసి అభివృద్ధి కావాలని అడగండని ప్రజలకు సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu