HomeTelugu Trendingగుంటూరు కారం: మాస్ సాంగ్ ప్రోమో విడుదల

గుంటూరు కారం: మాస్ సాంగ్ ప్రోమో విడుదల

Kurchi Madathapetti Song Pr
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వస్తుంది. తాజాగా మూవీ నుంచి ఓ మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్‌ చేశారు.

ఈ ప్రోమోలో మహేష్, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతోపాటు సాంగ్ మాస్ బీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఈ పూర్తి పాట శనివారం (డిసెంబర్ 30) రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్ల స్పీడు పెంచారు.

అందులో భాగంగానే ఇప్పుడీ మాస్ సాంగ్ ను అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా (జనవరి 12)న ఈ సినమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమాతో పాటు హనుమాన్, ఈగల్, నా సామి రంగ లాంటి సినిమాల విడుదల కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu