HomeTelugu Big Storiesసుశాంత్‌ నాకు అన్నలాంటివాడు.. సిగ్గుపడండి

సుశాంత్‌ నాకు అన్నలాంటివాడు.. సిగ్గుపడండి

Kushal tandon report he dat

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, నటి అంకిత లోఖండే దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ సందర్భంగా ప్రారంభమైన వీరి బంధం ఆ తర్వాత విబేధాలు రావడంతో ముగిసిపోయింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌ సుశాంత్‌తో విడిపోయిన తర్వాత అంకిత, కుశాల్‌ టాండన్‌ అనే నటుడితో కొన్నాళ్లు డేటింగ్‌ చేసిందంటూ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కుశాల్‌ టాండన్‌ దీనిపై స్పందించాడు. సదరు వెబ్‌సైట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సుశాంత్‌ తనకు అన్నలాంటి వాడని.. అంకిత మంచి స్నేహితురాలని స్పష్టం చేశాడు. ఈ మేరకు కుశాల్‌ ట్వీట్‌ చేశాడు.

‘నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది జర్నలిజమా.. నేను.. సుశాంత్‌, అంకితలకు మంచి స్నేహితుడిని. తను‌ నాకు సోదరుడిలాంటివాడు. అంకిత నాకు మంచి స్నేహితురాలు. దయచేసి మీ బ్లేమ్ ‌గేమ్‌లో నన్ను చేర్చకండి. ఇలాంటి వార్తా ప్రపంచంలో ఉన్నందుకు షాక్‌ అవుతున్నాను’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సుశాంత్‌ మృతిని సర్కస్‌లా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు‌. ‘ప్రపంచమా.. దయచేసి తన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ జరుగుతున్న సర్కస్‌ని చూసి స్వర్గంలో ఉన్న ఆ వజ్రం గట్టిగా నవ్వుతుంది. సుశీ. ఎప్పటిలానే వీటన్నింటిని లైట్‌ తీసుకో. చిల్‌ అవ్వు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు కుశాల్‌ టాండన్‌.

 అంకిత స్పందిస్తూ.. ‘ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు తను ఎవరితో డేటింగ్‌లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికి ఒక్కటి స్పష్టంగా చెప్తున్నాను. ఎవరితోనే డేటింగ్‌ చేయాల్సిన అవసరం నాకు లేదు.. సమయం అంతకన్నా లేదు. నా పని నాకు ముఖ్యం. ఇలాంటి వార్తలు చదివి.. స్పందించి.. వివరణ ఇవ్వడం కూడా దండగ’ అన్నారు అంకిత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!