HomeTelugu Newsధోని రిటైర్మెంట్‌పై లతా మంగేష్కర్‌ ట్వీట్‌.. వైరల్‌

ధోని రిటైర్మెంట్‌పై లతా మంగేష్కర్‌ ట్వీట్‌.. వైరల్‌

15 4ఈ ప్రపంచకప్‌ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై ప్రముఖ సింగర్‌ లతా మంగేష్కర్‌ స్పందించారు. ధోని రిటైర్మెంట్‌ ఆలోచనను మానుకోవాలంటూ ట్విటర్‌ వేదికగా కోరారు.

‘ధోని జీ. మీరు రిటైర్‌ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్‌లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్‌ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అంటూ లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానులు భారీ ఎత్తున మద్దతు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu