ఆ హీరోయిన్ కోసం అన్నదమ్ముల ఫైట్..?

‘జై లవకుశ’ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ కూడా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సంధర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లెక్క ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండాలి కానీ రాశిఖన్నా, నివేదా థామస్ లు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్స్ అని వెల్లడించింది చిత్రబృందం.
దీంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకు హీరోయిన్ ఉండదా..? అనే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయనొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను రివీల్ చేశారు. సినిమాలో జై పాత్రకు కూడా లవ్ యాంగిల్ ఉంటుందట. జై, కుశ పాత్రలు నివేదా థామస్ ను ప్రేమిస్తారట. నివేదా మాత్రం కుశతో ప్రేమలో ఉంటుంది. అంటే నివేదా కోసం అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుందేమో.. రాశిఖన్నా మాత్రం లవకుమార్ కు జోడీ అని క్లారిటీ ఇచ్చేశాడు ఎన్టీఆర్.