వరుస అవకాశాలతో బీజీ అవుతున్న మహేష్‌ మాచిడి


సొంత ప్రతిభతో హీరో స్థాయికి ఎదిగిన వ్యక్తి మహేష్ మాచిడి. చిన్నప్పటి నుంచే తనకంటూ ఓ ప్రత్యేకతను తానే రూపొందించుకున్నాడు. తన గోల్‌ని మరిచిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో స్థాయికి ఎదిగాడు. తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి తన ఆలోచనా విధానం అందరిలోనూ తాను ఓ స్పషల్‌గా ఉండాలనుకునేవాడు. తన కుటుంబానికి ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా ఈ స్థాయికి చేరుకున్నాడు.

స్కూల్ లైఫ్ నుంచే అందరిలో తాను భిన్నంగా ఉండాలనుకునేవాడు. డ్రస్, స్టయిల్ ఇలా అన్నిటిలో ఇతరులకంటే డిఫరెంట్‌గా ఆలోచించేవాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తనకంటూ ఒక విలక్షణమైన ఒరవడిని సృష్టించుకుని, సొంత ప్రతిభతో హీరో స్థాయికి ఎదిగాడు. ఇంజినీరింగ్ చదువుతూ మోడలింగ్‌లో అడుగుపెట్టాడు. షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. కాలేజీలో ఉన్నప్పుడు తన ఖర్చులకు తానే సంపాదించుకునేవాడు. యూట్యూబ్ ఛానల్‌లో యాంకర్‌గా ఎంతోమంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాడు. దిల్‌సే విత్ మహేష్ మాచిడి అనే షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను సొంతంగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌ ద్వారా రాంగోపాల్ వర్మ, లక్ష్మీ పార్వతి, కేఏ పాల్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేశాడు.

6 అడుగుల ఎత్తు 6 ప్యాక్ బాడీతో కనిపించే మహేష్ మాచిడి రెండేళ్ల క్రితం మిస్టర్ ఇండియా కర్నాటకలో విజేతగా నిలిచాడు. మాంగో మ్యూజిక్ ఆధ్వర్యంలో చేసిన “చిన్ని ఓ ఆశ”, “నిన్నే చూసానే ఓ పిల్ల” ఆల్బమ్స్ మహేష్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత సొంతంగా ఓ ట్రావెలింగ్ షో మొదలుపెట్టాడు. చిన్నతనంలో తనను ఆకర్షించిన విహారి షో తరహాలో “లైఫ్ ఈజ్ ట్రావెలింగ్ టు మేక్ బెస్ట్ మెమరీ ఫరెవర్” అనే షో చేశాడు. స్నేహ హాలిడేస్ సహాయంతో గోవా, హిమాచల్ ప్రదేశ్, కులూ మనాలి, సిమ్లా, దుబాయ్, యూరోప్ వంటి ప్రదేశాలు తిరిగాడు.
ఇంటర్వ్యూలు, కాలేజ్ షోస్ తో పాటు మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా చేసేవాడు. ‘భలే మంచి చౌక భేరము’, ‘వైఫ్ అఫ్ రామ్’ వంటి సినిమాలకు ప్రమోషనల్ ఈవెంట్స్ చేశాడు. ‘వైఫ్ అఫ్ రామ్’ సమయంలో మంచు లక్ష్మి టీమ్‌కు దగ్గరయ్యాడు. తద్వారా ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ పరిచయాలు తనకు హీరోగా అవకాశం కల్పించాయి. తాజాగా మహేష్ మాచిడి నటించిన కన్నడ మూవీ ‘గ్యాంగ్’ తో పాటు ‘sshhhh…..!’ మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. Sshhh….! సినిమా OTTలో మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్‌ కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates