HomeTelugu Trendingహాద్దులు చెరిపేసి.. లిప్‌లాక్స్‌కి ఓకే చెప్పిన లావణ్యా త్రిపాఠి

హాద్దులు చెరిపేసి.. లిప్‌లాక్స్‌కి ఓకే చెప్పిన లావణ్యా త్రిపాఠి

Lavanya tripathi accepted l

టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్యా త్రిపాఠి. పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి.. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందింది. చివరగా నటించిన అర్జున్‌ సురవరంలో నటించింది. తాజాగా ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో లావణ్యా త్రిపాఠి ఫిమేల్‌ లీడ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైల‌ర్‌లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ క‌నిపిస్తున్నారు. అత‌డి ప్రేమికురాలిగా లావణ్య కూడా హాకీ ప్లేయ‌ర్‌ కావ‌డం విశేషం. కాగా ఈ ట్రైలర్‌లో ఓ చోట లావణ్య.. సందీప్‌ను లిప్‌లాక్‌ చేస్తున్నట్లు దృశ్యం ఒకటి ఉంది. అయితే గ్లామర్ షో చేయడం నచ్చదని చెప్పే లావణ్య ఈ సారి తన హద్దులు చెరిపేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధపడిందా అని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలో కూడా ఇలాంటి సన్నీవేశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లావణ్య న‌టించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్‌, చావు క‌బురు చ‌ల్లగా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu