చీరలు బోర్ అంటోంది!

ఎలాంటి హడావిడి లేకుండా.. సైలెంట్ గా ఉంటూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది లావణ్య త్రిపాఠి. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో ట్రడిషనల్ గానే కనిపించింది. ఏ మూలాన కూడా గ్లామర్ ప్రదర్శనకు తావు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అలా చీరకట్టులో కనిపించడం బోర్ అంటోంది లావణ్య త్రిపాఠి. ‘భారతీయ స్త్రీలు చీరల్లో అందంగా కనిపిస్తారు. నాకు కూడా చీరలంటే చాలా ఇష్టం. కానీ అలా అని అన్ని పాత్రల్లో చీరలు మాత్రం కట్టుకుంటూ ఉండాలంటే కష్టం. కొన్నేళ్ళ తరువాత నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రకాల పాత్రలు కనిపించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాను. విభిన్నమైన పాత్రల్లో నటించాలి. నా లక్ష్యం అదే’ అని చెబుతోంది.

‘సోగ్గాడే చిన్ని నాయన’ అలానే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ‘మిస్టర్’ వంటి సినిమాల్లో ఆమె పాత్రలు పూర్తి చీరల్లోనే కనిపిస్తాయి. అందుకే అమ్మడుకి బాగా బోర్ కొట్టినట్లు ఉంది. ఈ స్టేట్మెంట్ ను బట్టి లావణ్యకు గ్లామరస్ రోల్స్ ఎవరైనా ఆఫర్ చేస్తారేమో.. చూడాలి!