HomeTelugu Trendingఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల అభినందనలు

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల అభినందనలు

3 6ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి దశలో ఇబ్బంది నెలకొంది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు నుంచి ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. ఈ 15 నిమిషాల్లో 14 నిమిషాలు ఎంతో సాఫీగానే సాగిపోయి ఇక జాబిల్లిపై కాలుమోపడమే తరువాయి అనుకున్న దశలో ఊహించని అవాంతరం తలెత్తింది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు, దేశ ప్రజలు నిరాశలో మునిగిపోయారు. ప్రయోగం చివరి క్షణంలో సంకేతాలు ఆగిపోవడంతో బెంగళూరులోని ఇస్రో సెంటర్‌లో నిశ్శబ్దం రాజ్యమేలింది. అయితే ముందుగా తేరుకున్న మోదీ వారికి ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని అభినందించారు ప్రధాని నరేంద్రమోడీ. సైంటిస్టులు ప్రయోగం కోసం చాలా శ్రమించారని, భారత్‌ గర్వపడేలా చేశారంటూ ట్వీట్‌ చేశారు. శాస్త్రవేత్తలు మున్ముందు కూడా మరింత ధైర్యంగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మరిన్ని అంతరిక్ష ప్రయోగాలను కొనసాగిస్తామన్నారు.

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్: ఇస్రో బృందం అద్భుతంగా పనిచేసిందని, శాస్త్రవేత్తలు ఎంతో అంకితభావంతో పనిచేశారని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొనియాడారు. భవిష్యత్‌లో సంపూర్ణ విజయం సాధిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు

రాహుల్ గాంధీ: శాస్త్రవేత్తల శ్రమ వృథాకాదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగం కోసం కష్టపడ్డ శాస్త్రవేత్తలను రాహుల్‌గాంధీ అభినందించారు. దేశ ప్రజలందరికీ శాస్త్రవేత్తలు స్ఫూర్తిగా నిలిచారంటూ కొనియాడారు. చంద్రయాన్‌ 2తో మరెన్నో ప్రయోగాలకు నాంది పలికారని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా : చంద్రయాన్2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం, నిబద్ధతను చూసి దేశం మొత్తం వారివైపు నిలిచిందని, భవిష్యత్తులో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు కేంద్రం హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

ఇస్రోకు దేశ ప్రజలు సైతం అండగా నిలిచారు. కోల్పోయింది సిగ్నల్సే కానీ నమ్మకాన్ని మాత్రం కాదంటూ ట్వీట్లు చేస్తూ ఇస్రోకు అండగా నిలుస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu