
Highest Paid OTT actors in India:
ఇటీవలి కాలంలో ఒటీటీ ప్లాట్‌ఫారమ్స్ అనేవి భారతీయ వినోద రంగాన్ని పూర్తిగా మార్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫారమ్స్ ప్రేక్షకులకు మంచి అనుభవం, అందుబాటులో ఉన్న ధరలతో వినోదాన్ని అందించాయి. ఈ ఒటీటీ విప్లవం వల్ల కొత్త నటులకు డిమాండ్ పెరిగింది.
ఈ కోవలో జైదీప్ అహ్లావత్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్‌లో హతిరామ్ చౌధరి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జైదీప్, మొదటి సీజన్ కోసం 40 లక్షల పారితోషికం తీసుకున్నారు. కానీ రెండో సీజన్ కోసం ఏకంగా 20 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం.
జైదీప్ రెండవ స్థానంలో ఉండగా, సైఫ్ అలీ ఖాన్ మూడవ స్థానంలో నిలిచారు. అలాగే, కరీనా కపూర్ తన నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘జానే జాన్’ ద్వారా 10 నుంచి 12 కోట్ల మధ్య పారితోషికం తీసుకుని, రాధికా ఆప్టే స్థానాన్ని అధిగమించారు.
టాప్ 8 జాబితా:
1. అజయ్ దేవగన్ – రూ. 125 కోట్లు
2. జైదీప్ అహ్లావత్ – రూ. 20 కోట్లు
3. సైఫ్ అలీ ఖాన్ – రూ. 15 కోట్లు
4. పంకజ్ త్రిపాఠి – రూ. 12 కోట్లు
5. కరీనా కపూర్ – రూ. 10-12 కోట్లు
6. మనోజ్ బాజ్‌పేయి – రూ. 10 కోట్లు
7. రాధికా ఆప్టే – రూ. 4 కోట్లు
8. సమంత – రూ. 3-4 కోట్లు
ALSO READ: 2024 లో అత్యధిక లాభాలు తీసుకువచ్చిన సినిమా Pushpa 2 కాదా?