
Summer 2025 Telugu movie releases:
సమ్మర్ 2025లో చిన్న, మధ్యతరహా సినిమాలు దుమ్మురేపేందుకు సిద్దమవుతున్నాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి ‘విశ్వంభరా’ మరియు రవితేజ ‘రాజా సాబ్’ లాంటి చిత్రాలు సమ్మర్ రేస్ నుంచి బయటకు వచ్చాయి. దీంతో పలువురు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
పవన్ కళ్యాణ్, నాని, నితిన్, విజయ్ దేవరకొండ, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, శ్రీ విష్ణు లాంటి హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా ఈసారి డబ్బింగ్ చిత్రాలు కూడా భారీ సంఖ్యలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
సమ్మర్ 2025 రిలీజ్ చార్ట్:
మార్చి:
14న: ‘దిల్‌రుబా’, ‘కోర్ట్’
21న: ‘పెళ్లికాని ప్రసాద్’
27న: ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’ (తమిళం), ‘L2: Empuraan’ (మలయాళం)
28న: ‘రాబిన్‌హుడ్’, ‘MAD Square’
30న: ‘సికందర్’ (హిందీ)
ఏప్రిల్:
4న: ‘భైరవం’
10న: ‘జాక్’, ‘జాట్’ (హిందీ మరియు తెలుగు), ‘Good Bad Ugly’ (తమిళం)
17న: ‘అర్జున్ S/O వైజయంతి’
18న: ‘ఘాటి’, ‘సుందరకాండ’, ‘కేసరి చాప్టర్ 2’ (హిందీ)
25న: ‘కన్నప్ప’
మే:
1న: ‘HIT: The Third Case’, ‘Retro’ (తమిళం), ‘Raid 2’ (హిందీ)
9న: ‘హరి హర వీర మల్లు పార్ట్ – 1’, ‘తమ్ముడు’
16న: ‘సింగిల్’
21న: ‘Mission: Impossible – The Final Reckoning’
30న: ‘Kingdom’
ఈసారి పెద్ద సినిమాలు పోటీ లేకుండా చాలా మధ్యతరహా సినిమాలు మంచి హిట్ కొట్టే అవకాశం ఉంది. మరి ఈ సమ్మర్ ఎవరి సినిమాలు హిట్టవుతాయో వేచి చూడాలి.