
Hari Hara Veera Mallu Budget:
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సహ దర్శకుడు జ్యోతి కృష్ణ ఇటీవల మాచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్‌లో బయటపెట్టారు.
జ్యోతి కృష్ణ మాట్లాడుతూ – ‘‘బ్రిటిషర్లు మన దేశాన్ని ఆక్రమించే ముందు, మొహమ్మద్ సుల్తాన్ అనే రాజు బందరు పోర్ట్ ద్వారా మన దేశానికి గేట్వేలా మారాడు. ఈ పోర్ట్ ఆధారంగా ఒక భారీ సీన్‌ను 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కించాం. ప్రేక్షకులు థియేటర్‌లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి’’ అని అన్నారు.
ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారట. ‘‘బ్రిటిషర్లు మన సంపదను దోచుకుపోయే ప్రయత్నంలో ఉంటారు, కానీ పవన్ సర్ వారిని అడ్డుకుంటారు. ఇది “సీజ్ ద షిప్” అన్న డైలాగ్ గుర్తు వచ్చేలా ఉంటుంది. థియేటర్‌లో మాస్ రెస్పాన్స్ ఖాయం’’ అన్నారు జ్యోతి కృష్ణ.
ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే రిలీజ్ డేట్ పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా కోసం రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారట. నిర్మాత ఏఎం రత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జ్యోతి కృష్ణ.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫిజికలీ, మెంటలీ రెండు వైపులా కూడ బాగా ట్రైనింగ్ తీసుకున్నారట. ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 17వ శతాబ్దం నేపథ్యం, బ్రిటిష్ కాలం, పోర్ట్ బ్యాక్‌డ్రాప్, పవన్ కళ్యాణ్ యాక్షన్ అన్నీ కలిసొస్తే ఫ్యాన్స్‌కు పండుగే అన్న మాట.
ALSO READ: Bigg Boss Telugu 9 పనులు మొదలు.. కంటెస్టెంట్స్ వీళ్ళేనా?