‘ఖైదీ’ డైరెక్టర్‌తో రామ్‌ చరణ్‌ మూవీ!

‘ఖైదీ’ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు త్వరలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఓ సినిమా చేయనున్నాడట. కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమతో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ యంగ్‌ డైరెక్టర్ వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఖైది సినిమాతో తమిళంలో కాదు తెలుగులోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ డైరెక్టర్‌తో పనిచేసేందుకు పలువురు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తలపతి విజయ్‌తో మాస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ కన్ను మన తెలుగు హీరోలపై పడిందట. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో కనగరాజు ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై రామ్‌చరణ్‌ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రామ్‌ చరణ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, దీన్ని తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తారని సినీ వర్గాల టాక్‌. ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నారట. ఇప్పటికే డైరెక్టర్‌ కనగరాజుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates