నా రాక్షసితో పనిచేయడం సంతోషంగా ఉంది: రమ్యకృష్ణ

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ హీరోగా తెరకెక్కుతున్న ‘రొమాంటిక్‌’ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్‌ పాడూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాశ్‌కు జంటగా కేతికాశర్మ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. దీంతో షూటింగ్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ సెట్‌లో ఛార్మితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘గోవాలో జరుగుతున్న ‘రొమాంటిక్‌’ షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆకాశ్‌ పూరీ, కేతికాశర్మ జంట అందర్నీ ఆకట్టుకుంటుంది. అనిల్‌ పాడూరి ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కిస్తున్నారు. పూరీజగన్నాథ్‌, నా రాక్షసి ఛార్మితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.’ అని రమ్యకృష్ణ పేర్కొన్నారు. కాగా రమ్యకృష్ణ ట్వీట్‌పై స్పందించిన ఛార్మి సోషల్‌మీడియా వేదికగా.. ‘మీరు మన ‘రొమాంటిక్‌’ చిత్రానికి మరింత అందాన్ని తీసుకువచ్చారు. లవ్‌ యూ.’ అని అన్నారు.