HomeTelugu Newsవిష్ణు తన లక్ ను పరీక్షించుకోనున్నాడు!

విష్ణు తన లక్ ను పరీక్షించుకోనున్నాడు!

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ “లక్కున్నోడు”. “గీతాంజలి” ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యు/ఎ” సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. “దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద” లాంటి సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ తర్వాత విష్ణు-హన్సిక జంటగా నటిస్తున్న చిత్రం కావడంతోపాటు, “ఈడోరకం ఆడోరకం” వంటి సూపర్ హిట్ అనంతరం మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అవ్వడంతో “లక్కున్నోడు”పై మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా “లకున్నోడు” చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu