‘మా’ ఎన్నికలు ముగిసాయి

హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న మా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ముగిసాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నటీనటుల సంఘంలో మొత్తం 745 ఓట్లు ఉండగా.. రికార్డు స్థాయిలో 472 ఓట్లు నమోదు అయ్యాయి. మొదటి ఓటు నరేష్ వినియోగించుకోగా.. చివరి ఓటు చిట్టిబాబు వేశారు.

ఈ ఎన్నికలలో శివాజీ రాజా, నరేష్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఫిల్మ్‌ ఛాంబర్‌ లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది. మూవీ అసోసియేషన్‌ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.