‘మళ్లీ పెళ్లి’ ని ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్‌ భార్య

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆమె.

ఈ మేరకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేశ్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఈ సినిమాపై ఆకస్తిని పెంచేశాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates