HomeTelugu Big Stories'మా' ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌కు నరేష్‌ సెటైర్‌!

‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌కు నరేష్‌ సెటైర్‌!

Maa president naresh satiri

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్యవహారం వాడీవేడీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న‘మా’ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ట్విటర్‌ వేదికగా ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌, అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్‌రాజ్‌ మాటకు మాట సమాధానమిచ్చుకున్నారు. ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానల్‌ని సిద్ధం చేసుకున్న ప్రకాశ్‌రాజ్‌.. ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ‘ఎన్నికలు ఎప్పుడు? #JUST Asking’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌పై తాజాగా నరేష్‌ స్పందించారు.

ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి మా సమాధానమిదే అంటూ సెటైర్‌ వేశారు. ‘ఎన్నికల విషయమై ఇప్పటికే ‘మా’ నుంచి ఎన్నో సార్లు సమాధానం ఇచ్చినప్పటికీ కొంతమంది మరలా అదే పనిగా ‘ఎన్నికలు ఎప్పుడు?’ అంటూ ప్రశ్నించడాన్ని చూస్తుంటే.. ‘నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకనా?’ అని అడిగినట్లు ఉంది’ అంటూ నరేష్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా, సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న జనరల్‌ బాడీ మీటింగ్‌ వాయిదా పడిందని.. పరిస్థితులు చక్కబడిన వెంటనే మీటింగ్‌ పెట్టి.. గడిచిన రెండేళ్ల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలను అందరికీ తెలియచేస్తామని నరేష్‌ వెల్లడించారు. మా నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయండి సార్‌’ అంటూ నరేష్‌ ఘాటు రిప్లై ఇచ్చారు. ఈ విషయంపై ఏప్రిల్ 12న ఇదివరకే ప్రకాష్‌రాజ్‌కి పంపిన లేఖను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరగనున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు ‘మా’ సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమతోపాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!