HomeTelugu Newsమహేష్‌ 'మహర్షి' రిలీజ్ డేట్ వచ్చేసింది

మహేష్‌ ‘మహర్షి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

9 17సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా తరువాత.. చేస్తున్న సినిమా మహర్షి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రారంభం రోజునే సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 5 న అని చూపిన సంగతి తెలిసిందే. అనుకోని కారణాల వలన సినిమాను పోస్ట్ ఫోన్ చేశారు.

దిల్ రాజు, సి అశ్విని దత్, పివిపి సినిమా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మహేష్ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాన్నినిర్మాత దిల్ రాజు ఈరోజు మీడియాతో పంచుకున్నారు. సినిమా విడుదల ఆలస్యం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పిన దిల్ రాజు, సినిమాను ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. మహేష్ బాబు 25 వ సినిమాగా వస్తున్న మహర్షిలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!