మహేంద్ర బాహుబలి లుక్ అదిరింది!

రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపును సంపాదించిందో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా
బాహుబలి 2 చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు రాజమౌళి. రేపు అనగా అక్టోబర్ 23న
ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను రాజమౌళి తన ట్విట్టర్
ద్వారా రిలీజ్ చేశారు. చేతికి గొలుసులు చుట్టుకొని కండలు తిరిగిన దేహంతో ఉన్న ప్రభాస్ లుక్ అభిమానులను
విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందనడానికి ఈ లుక్
ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది 28న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని
తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates