HomeTelugu Trendingడ్యాన్స్‌ షోకి అతిథిగా మహేశ్-సితార ‌.. వైరల్‌

డ్యాన్స్‌ షోకి అతిథిగా మహేశ్-సితార ‌.. వైరల్‌

Mahesh and his daughter sit
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు.. ఓ ప్రముఖ డ్యాన్స్‌ షోకి తన కూతురు సితారతో కలిసి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్‌తో ఫ్యాన్‌ని ఫిదా చేసింది. సాధారణంగానే మహేశ్‌ షోలు, ఫంక్షన్లకు చాలా తక్కువగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!