త్వరలోనే తన రాణిని పరిచయం చేస్తానంటున్న రాజ్‌ తరుణ్‌

టాలీవుడ్‌కు ఉయ్యాల జంపాల సినిమాతో పరిచయం అయిన యువ నటుడు రాజ్‌ తరుణ్‌. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ చిత్రం తరువాత ఈ యంగ్ హీరో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు సక్సెస్‌ అయినా స్టార్ ఇమేజ్‌ మాత్రం అందుకోలేకపోయాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన రాజ్‌ తరుణ్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానని చెప్పిన రాజ్‌ తరుణ్‌, త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోయే రాణిని పరిచయం చేస్తానన్నాడు.