మహేష్ సెల్ఫీ కోసం భర్తను మర్చిపోయింది!

ఒక్కోసారి పెళ్ళి జరిగే చోట కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటన సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ కూతురు పెళ్ళిలో కూడా జరిగింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు రిసప్షన్ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, బాలకృష్ణ, మంచు విష్ణు, అఖిల్, మంచు మనోజ్, బోయపాటి, బ్రహ్మానందం ఇలా చాలా మంది తారలు తరలివచ్చారు. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హాజరయ్యారు.

ఇందులో భాగంగా మహేష్ స్టేజ్ మీదకు వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించగా.. అక్కడకి వచ్చిన మహేష్ ను చూసిన పెళ్లికూతురు స్వాతి తన భర్తను పక్కన పెట్టేసి మహేష్ తో కలిసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడ ఉన్నవారంతా.. స్వాతి చేసి పనికి మూసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మహేష్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి!