పవన్ కళ్యాణ్‌ పై వర్మ సెటైర్స్‌


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకొని మరో ట్వీట్ వదిలారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. జనసేనతో పోలిస్తే.. ప్రజారాజ్యం బాహుబలి అని ట్వీట్ చేసిన వర్మ.. ఈసారి ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేనాని చేసిన వ్యాఖ్యలతో ఓ ట్వీట్ చేశారు. ‘జగన్ నువ్వెలా సీఎం అవుతావో చూస్తా? జగన్ నీకు మగతనం ఉందా? జగన్ నువ్వు అసలు రెడ్డివేనా? జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆపేదెవడు..’ ఇలా పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వర్మ ఇవన్నీ ఎవరన్నారు.. అడుగుతున్నానంతే.. అంటూ పోస్ట్ చేశారు.

జగన్ ఫ్యాన్స్ వర్మకు సపోర్ట్ చేస్తుంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకు గట్టి సమాధానం ఇస్తున్నారు. ‘పవన్ గెలిస్తే సీఎం అవుతాడు.. గెలవకపోతే గెలిచిన సీఎంకిఈ మాటలను కేఏ పాల్ అన్నాడా..? అంటూ ఆర్జీవీని పాల్‌తో పోలుస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్‌ను పొగిడిన వర్మ.. ఫలితాల తర్వాత పవన్‌పై సెటైర్లు వేస్తూ ఆయన ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు

CLICK HERE!! For the aha Latest Updates