HomeTelugu Trendingగుంటూరు కారం: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

గుంటూరు కారం: మహేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్

mahesh babu birthday specia

ఈ రోజు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌, ప్రముఖులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘గుంటూరు కారం’ సినిమా తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌ ఈ సినమాలో ఊరమాస్‌ గా ఉండబోతున్నడంట. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ని వీపరితంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా మహేష్‌ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి మరో మాస్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. లుంగీతో కూర్చొని ఓ చేతిలో అగ్గిపెట్ట, మరో చేతితో సిగరెట్‌ను అంటిస్తూ ఉన్న పోస్టర్ మహేష్‌ అభిమానులను ఓ రెంజ్‌లో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఫిక్స్‌ కాలేదు.

ప్రస్తుతం మహేష్‌ విదేశాల్లో ఉన్నాడు. రాగానే ఓ మేజర్‌ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఇక మహేష్‌ వచ్చే లోపు మిగిలిన కాస్ట్‌తో కొన్ని మేజర్‌ సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు వినికిడి‌. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!