పవన్ సహనాన్ని పరీక్షిస్తున శృతి!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అయితే అమ్మడు ప్రవర్తన వలన పవన్ చాలా ఇబ్బంది పడుతున్నట్లు టాక్. షూటింగ్ కు శృతిహాసన్ చెప్పిన
సమయానికి రావడం లేదట.

పవన్ కల్యాణ్ తో కాంబినేషన్ సీన్స్ ఉన్న రోజు కూడా అమ్మడు ఇలా ప్రవర్తిస్తోందట. శృతి కోసం పవన్ సెట్ కు వచ్చి ఎదురుచూసే పరిస్థితి కలుగుతోందని సమాచారం. దీంతో పవన్, శృతి హాసన్ పట్ల చాలా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. అసలే పవన్ కల్యాణ్ కు కోపం ఎక్కువ.. అతడి విషయంలో శృతిహాసన్ ఇలా ప్రవర్తిస్తుండడంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో.. అని చిత్ర బృందం టెన్షన్ పడుతోంది.

ఇప్పటికైనా శృతిహాసన్ తొందరగా తన తప్పును తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి!