పొల్లాచ్చిరాకెట్‌ లో ఇరుక్కున్న శ్రీ రెడ్డి.. ఇంటిపై దాడి..

వివాదస్పద నటి శ్రీ రెడ్డి సంచ‌ల‌నాలు, వ్యాఖ్యలు త‌మిళ‌నాట కూడా పాకిపోయాయి. ఇప్పుడు అక్క‌డ కూడా ఈమె ప్రకంప‌న‌లు రేగుతున్నాయి. కొన్ని రోజులుగా ఈమె చెన్నైలోనే ఉంది. అక్క‌డే ఉండి త‌మిళ సినిమాల్లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పైగా ఈమె బ‌యోపిక్ రెడ్డీస్ డైరీ కూడా అక్క‌డే తెర‌కెక్కుతుంది. ఇదిలా ఉంటే ఆ మ‌ధ్య వ‌ర‌స‌గా తెలుగు సెలెబ్రెటీల‌పై నోరు పారేసుకున్న శ్రీ రెడ్డి.. ఇప్పుడు త‌మిళ‌నాడుపై ప‌డింది. అక్క‌డ కూడా కొంద‌రు టాప్ హీరోల‌ను టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు ఈమె ఇంటిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడి చేసారు.

చెన్నైలో తాను ఉంటున్న ఇంటిపై అర్ధ‌రాత్రి వ‌చ్చి ఇద్ద‌రు దుండ‌గులు దాడి చేసార‌ని వ‌ల‌స‌ర‌వాకం పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టింది ఈ భామ‌. ఇంత‌కీ ఈమె చేసిన త‌ప్పేంటో తెలుసా.. పొల్లాచ్చి సెక్స్ రాకెట్ గురించి మాట్లాడ‌డ‌మే. ఎంతోమంది అమాయ‌క‌మైన అమ్మాయిలు ఇందులో బ‌లైపోయారు. అందులో త‌మిళ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉన్నార‌ని ఇప్ప‌టికే తేలింది. దాంతో ఇప్పుడు ఈ కేసులో శ్రీ రెడ్డి కూడా త‌ల దూర్చేస‌రికి ఆమెను భ‌య‌పెట్టాల‌ని ఇలాంటి ప‌ని చేసిన‌ట్లుగా పోలీసులు అనుమాన‌ప‌డుతున్నారు.

మ‌రోవైపు శ్రీ రెడ్డి మాత్రం తాను పొల్లాచ్చి ఘ‌ట‌న‌పై క‌చ్చితంగా మాట్లాడ‌తాను అంటుంది. ఇలాంటి బెదిరింపుల‌కు తాను అస్స‌లు భ‌య‌ప‌డ‌న‌ని.. తన ఇంటిపై జ‌రిగిన దాడిలో కాస్తలో త‌న‌కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని ఫిర్యాదు చేసింది శ్రీ రెడ్డి. ఇప్పుడు ఈ కేసు ధ‌ర్యాప్తు చేస్తున్నారు చెన్నై పోలీసులు. క్యాస్టింగ్ కౌచ్ గొడ‌వ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలేసి చెన్నైలో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు అక్క‌డ కూడా ర‌చ్చ మొద‌లు పెట్టింది. మ‌రి ఈ కేస్ ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి