దుబాయ్‌లో మహేష్‌ ఫ్యామిలీ తో, సానియా ఫ్యామిలీ..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు న్యూఇయర్‌ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. నూతన సంవత్సర వేడుకలను అక్కడే జరుపుకొన్నారు. అయితే ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా తన కుటుంబంతో దుబాయ్‌ వెళ్లారు. అలా అనుకోకుండా సానియా, మహేశ్‌ కుటుంబాలు కలుసుకున్నాయి. ఈ సందర్భంగా అందరూ కలిసే దుబాయ్‌ హాలిడేను ఎంజాయ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మహేష్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పంచుకున్నారు. ప్రముఖ గాయని కనికా కపూర్‌ కూడా వీరి గ్యాంగ్‌లో చేరారు.

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో న్యూఇయర్‌ సందర్భంగా నిర్వహించిన వేడుకలో మహేష్ చేతులు పట్టుకుని సితార డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. న్యూఇయర్‌ హాలిడే ఎంజాయ్‌మెంట్‌ ముగిసిందని త్వరలో భారత్‌కు వస్తున్నామని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ క్యాప్షన్స్‌లో పేర్కొన్నారు. మహేష్‌ కుటుంబం దుబాయ్‌లో ఉండటం వల్లే.. ఇటీవల జరిగిన ఎస్‌.ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయారు. నమ్రత షేర్‌ చేసిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

View this post on Instagram

Fun evenings!! #happynewyear #dubai #lastdaysofholidays

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on