‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌పై అఖిల్‌ స్పందన..!

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ మూవీ ట్రైలర్ నిన్న రాత్రి రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ అభిమానుల్ని, సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా ఇతర హీరోలు సైతం ట్రైలర్ బాగుందని అంటున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ ట్రైలర్ చూసి చాలా బాగుందని, మంచి యాక్షన్ సన్నివేశాలతో ఎనర్జిటిక్ గా ఉందని, చిట్టిబాబు సూపర్ హీరోగా మారాడని ప్రశంసించాడు. కాగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.