అహ్మదాబాద్ లో మహేష్ ఫైటింగులు!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్, చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమా షెడ్యూల్ అహ్మదాబాద్ లో ప్లాన్ చేశారు. రేపటి నుండి చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

దాదాపు ఓ నెలరోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఈ షూటింగ్ మహేష్ ఈ నెల 27 నుండి పాల్గొనున్నాడు. సినిమాలో కొన్ని ముఖ్యమైన యాక్షన్ ఎపిసోడ్స్ ను అక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మహేష్ బాబు ప్రత్యర్థి పాత్రలో ఎస్.జె.సూర్య మెరవనున్నారు. మొదటి నుండి సినిమాపై మంచి అంచనాలు ఉండడంతో కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో అటు చిత్రబృందం, ఇటు అభిమానులు ఉన్నారు.