మహేష్ ‘మైండ్ బ్లాక్ ‘ సాంగ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో షేక్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ కు భారీ స్పందన రావడంతో దానికి ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం రోజున ఒక సింగిల్ ను విడుదల చేయబోతున్నారు.

కొద్దిసేపటి క్రితం మహేష్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు. పక్కా మాస్ వే లో సాంగ్ ఉన్నది. మహేష్ బాబు ఇలాంటి సాంగ్ చేయడం ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు. పక్కా ర్యాప్ బీట్ తో అదిరిపోయింది. రాక్ స్టార్ దేవిశ్రీ మరోసారి తానేమిటో ఈ సాంగ్ ద్వారా నిరూపించుకున్నారు. ఫస్ట్ సింగిల్ తోనే మహేష్ బాబు ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేశారు. మరి ఈ సాంగ్ కు తగ్గ స్టెప్పులు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు వేచిచూడాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates