నయన్ కు మాజీ ప్రేమికులతో నో ప్రాబ్లెమ్!

దక్షిణాది అగ్ర కథానాయికల్లో నయనతార ఒకరు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన కూడా నటిస్తోన్న ఈ భామకు గతంలో రెండు ప్రేమ వ్యవహారాలు ఉన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ ఆరంభంలోనే శింబుతో లవ్ బ్రేకప్ అయింది. ఇక తన కెరీర్ ఓ రేంజ్ లో ఉన్నప్పుడూ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది. ఈ లవ్ ఫెయిల్యూర్స్ తో నయన్ బాగా డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు ఆమె ఎవరివల్ల బాధ పడిందో వారితో కలిసి పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టడం లేదనేది లేటెస్ట్ టాక్.

ఇటీవల శింబుతో కలిసి ఓ సినిమాలో నటించిన నయన్ తాజాగా ప్రభుదేవా సినిమాలో కూడా నటించడానికి ఓకే చెప్పింది. ప్రభుదేవా హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథ నచ్చితే చాలు హీరోలు ఎవరనే విషయాన్ని కూడా అమ్మడు పట్టించుకోవడం లేదు. తన మాజీ ప్రేమికులైనా.. పెద్ద మనసు చేసుకొని సినిమాలకు ఓకే చెబుతోంది.