HomeTelugu Trendingసిక్స్‌ ప్యాక్‌తో మహేష్‌..?

సిక్స్‌ ప్యాక్‌తో మహేష్‌..?

2 21టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు త్వరలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు జిమ్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు మరింత బలం చేకూర్చాయి. పరశురామ్ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. మహేష్‌తో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని కమిట్‌మెంట్, డెడికేషన్ ఉన్న నటుడని ట్వీట్ చేశాడు మీనాష్. మహేష్‌తో ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ మళ్లీ కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నట్లు తెలిపాడు. సల్మాన్‌ ఖాన్‌లా కండల వీరుడు అనిపించుకోవాలని కోరిక మహేష్‌ బాబుకు చాలాకాలంగా ఉందంట. క్యూట్‌గా మిల్కీబోయ్‌గా కనిపించే మన మహేష్‌కు ఇప్పటి వరకు కండలు చూపించే అవకాశం రాలేదు. అయితే సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయాలనే కల మాత్రం ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ‘నెం.1’ నేనొక్కడినే.. సినిమాలో ఓ సీన్‌లో బ్యాక్ నుంచి మాత్రమే తన బాడీని చూపించాడు మహేష్‌.

అయితే ఇప్పటికే హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సిక్స్ ప్యాక్ చేసి సక్సెస్ అయ్యారు. దీంతో మహేష్ దృష్టి కూడా సిక్స్ ప్యాక్‌పై పడినట్లు తెలుస్తుంది. లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఇంట్లో ఉన్న జిమ్‌లో కంటిన్యూగా కసరత్తులు చేస్తున్నాడు. అలాగే సితారతో దిగిన ఫొటోలో జిమ్ బాడీతో కనిపించాడు మహేష్. అయితే పరశురామ్ సినిమాలో సిక్స్‌ ప్యాక్ చూపిస్తాడో లేక రాజమౌళి సినిమా కోసం దాచిపెడతాడో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu