HomeTelugu Trending'మేజర్' మూవీ టికెట్స్‌ కోసం క్యూలో నిలబడిన మహేష్‌.. వీడియో వైరల్‌

‘మేజర్’ మూవీ టికెట్స్‌ కోసం క్యూలో నిలబడిన మహేష్‌.. వీడియో వైరల్‌

major

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ నటించిన తాజా ‘మేజర్’‌. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిచారు. ఈ సినిమా కి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్‌ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్‌ ప్రివ్యూ ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. మే 24 నుంచి రోజులో సెంటర్‌లో మేజర్‌ మూవీ ప్రివ్యూలను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్స్‌లో భాగంగా మేజర్ సినిమా టికెట్స్ కోసం మహేశ్‌ బాబు క్యూలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు నిర్మాత అయిన మహేశ్‌ బాబు, ప్రముఖ యూట్యూబర్‌ నిహారిక ఎన్‌ఎమ్‌తో కలిసి వినూత్నంగా ఓ వీడియోను రూపొందించారు. ఇందులో అడవి శేష్‌ కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోలో.. ”ఇది మేజర్‌ సినిమా లైనేనా అని టికెట్‌ కౌంటర్‌ వద్ద నిలబడి ఉన్న వ్యక్తిని అడుగుతుంది నిహారిక. అతను అవును అనేసరికి క్యూలో నిలుచుంటుంది. తర్వాత వచ్చిన వారంతా ఆమె కుంటే ముందు నిలబడుతుంటారు. అలా అడవి శేష్‌ కూడా వచ్చి తన ముందు నిలుచుండేసరికి అతనితో గొడవపడుతుంది. తర్వాత క్యూ లైన్‌లోకి వచ్చిన మహేశ్‌ బాబును చూసి ఆశ్చర్యపోతుంది. అనంతరం మహేశ్ బాబు వెనక్కి తిరిగి తన ఫ్రెండ్స్‌ను కూడా పిలవచ్చా అని నిహారికను అడుగుతాడు. ఆమె ఓకే అంటుంది. అప్పుడే మహేశ్‌ బాబు ఫోన్‌ నెంబర్ అడుగుతుంది. అంతలోనే మహేశ్‌ బాబు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.” ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!