‘మేజర్‌’ టీజర్‌ వచ్చేసింది

Major Teaser
టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ నటించిన తాజా చిత్రం ‘మేజర్‌’. ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ విడులైంది. ఇందులో అడివి శేష్‌ డైలాగ్స్‌ ఉద్విగ్నంగా ఉన్నాయి.

సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్‌బాబు నిర్మిస్తున్నారు. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌లు ఈ టీజర్‌ను విడుదల చేశారు. జులై 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates