HomeTelugu Trendingమహేష్‌ లుక్‌.. ఆ చిత్రం కోసమేనా!

మహేష్‌ లుక్‌.. ఆ చిత్రం కోసమేనా!

Mahesh babu latest photo go
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. వరుసగా హిట్లు అందుకుంటూ మంచి జోష్ లో ఉన్నాడు మహేష్. దాంతో పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్- 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ అభిమానులతో ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇన్ని రోజులు కరోనా ఎఫెక్ట్‌తో ఇంటికే పరిమితమైన మహేష్ తాజాగా కెమెరా ముందుకు వచ్చాడు. ఏడు సినిమా కోసం కాదనుకోండి.

తాజాగా మహేష్‌ ఓ యాడ్ షూట్ కోసం కెమెరా ముందుకు వచ్చాడు. తాజాగా ఈ యాడ్ కోసం మహేష్ ఫోటో షూట్ చేశాడు. ఈ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. లైట్ గడ్డం తో డిఫరెంట్ హెయిర్ స్టైల్, టీషర్ట్ లో మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే లుక్ తో సర్కారు వారి పాట చిత్రంలో కూడా మహేష్ బాబు కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu