ఛాన్సుల కోసం వేధించారు: ఆశిష్ బిష్ట్

సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి మోడల్ టర్నెడ్ హీరో చెప్పిన నిజాలు వింటుంటే షాకింగ్ గా అనిపిస్తుంది. పరిశ్రమలో అవకాశాల కోసం లెస్బియన్ యాక్ట్ కు సిద్ధంగా ఉండాలని ఈ యువ హీరో వెల్లడించడం సంచలనమైంది. ”ఆర్ యు కంఫర్టబుల్ ఇన్ బెడ్..?” అని పలువురు నిర్మాతలు తన కెరీర్ ఆరంభంలో వేధించిన విషయాలను గుర్తు చేసుకున్నాడు. ముంబైలో కాస్టింగ్ కౌచ్ అనేది అతి భయంకరంగా ఉంటుందని ఈ హీరో తన మాటలతో తేల్చి చెప్పేశాడు. ఉత్తరాఖండ్ కు 
చెందిన ఆశిష్ ఇటీవలే ‘షాబ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అలానే మరికొన్ని సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. అయితే పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు కొందరు నిర్మాతలు నేరుగా.. ‘క్యా తుమ్ బెడ్ పే కంఫర్టబుల్ హూ..?’ అంటూ ప్రశ్నించేవారని అన్నారు. కొందరు ఆడవాళ్ళు కూడా తమతో బెడ్ షేర్ చేసుకోమని వేధించారని ఆశిష్ తెలిపాడు. కావాలని ఇంటికి పిలిచి చెత్తగా మాట్లాడేవారని అన్నారు. ఓ డిజైనర్ నువ్వు నాతో ఉంటే.. నీకు బోలెడన్ని అవకాశాలు ఉంటాయని స్ట్రెయిట్ గా చెప్పేశాడని ఇటువంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని గుర్తు చేసుకొని గగ్గోలు పెడుతున్నాడు. చివరకు ఓనీర్ లాంటి మంచి దర్శకుడి కారణంగా నాకు ‘షాబ్’ సినిమా అవకాశం వచ్చిందని అన్నారు.