మహేష్ సినిమా ‘తుపాకి’ సీక్వెల్..?

మహేష్ బాబు , మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. దీని తరువాత చిత్రబృందం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను జరపనుంది. ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ బాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తుపాకి’ సినిమాకు సీక్వెల్ అనే
ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని నిర్మాత ఠాగూర్ మధు కూడా అంగీకరించారు. ఈ సినిమా తుపాకి 2.0 వెర్షన్ మాదిరి ఉంటుందని ఆయన తెలియజేశారు. విజయ్ నటించిన తుపాకి భారీ వసూళ్లను సాధించింది. దీంతో మహేష్ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అక్షయ్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనతో రిలీజ్ ఆలోచన పక్కన పెట్టేశారు. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.