HomeTelugu Trendingవెంకీ కుడుములతో సూపర్‌ స్టార్‌?

వెంకీ కుడుములతో సూపర్‌ స్టార్‌?

4 16
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంతవరకు ఓ క్లారిటీ రాలేదు అయితే మహేష్ కు ఇప్పటికే చాలా మంది కథలు వినిపించినరట్లు తెలుస్తుంది. అయితే వంశీ పైడిపల్లి తో సినిమా చెయ్యాల్సి ఉన్న అది ఎందుకో పట్టాలెక్కలేదు. దాంతో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మహేష్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ లో మహేష్ కు మరి కొంతమంది డైరెక్టర్‌లు కూడా స్టోరీ వినిపించారని సమాచారం. వారిలో నితిన్ దర్శకుడు కూడా ఉన్నాడంట.

‘ఛలో’ సినిమా తో దర్శకుడిగా అడుగు పెట్టి తాజాగా నితిన్ తో ‘భీష్మ’ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు వెంకీ కుడుముల. ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ కు ఓ స్టోరీ వినిపించాడని తెలుస్తుంది. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి మహేష్‌ మొగ్గు చూపించారని సమాచారం. అయితే ప్రస్తుతం మహేష్‌బాబుకు ఉన్న కమిట్‌మెంట్స్‌ పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్‌ గురించి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu