HomeTelugu Trendingషాలిని రీఎంట్రీ!

షాలిని రీఎంట్రీ!

Shalini reentry with manira

బాలనటి, అజిత్ భార్య న‌టి షాలిని రీఎంట్రీ ఇస్తుంది. మాధ‌వ‌న్ న‌టించిన స‌ఖి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌య‌మైంది కోలీవుడ్ న‌టి షాలిని ఈ చిత్రంలో షాలిని పోషించిన రోల్ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. తాజా సమాచారం ప్ర‌కారం షాలిని మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు కోలీవుడ్ స‌ర్కిల్ టాక్‌. మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్.

ఈ చిత్రంతో షాలిని రీఎంట్రీ ఇవ్వ‌నుండ‌గా.. ఇందులో చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పొన్నియ‌న్ సెల్వ‌న్ రెండు పార్టులుగా రానుంది. మొద‌టి భాగం 2022లో విడుద‌ల కానుంది. మ‌రి షాలిని ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతుంద‌ని మూవీ ల‌వ‌ర్స్ చాలా ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఎపిక్ హిస్టారిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్, జ‌యం ర‌వి, కార్తి, త్రిష‌, జ‌య‌రామ్‌, విక్ర‌మ్ ప్ర‌భు, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, శోభితా ధూళిపాళ కీ పాత్రలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu