HomeTelugu Trendingలేడీ డైరెక్టర్‌తో మహేష్‌ బాబు నెక్స్ట్‌ మూవీ!

లేడీ డైరెక్టర్‌తో మహేష్‌ బాబు నెక్స్ట్‌ మూవీ!

Mahesh Babu Next Movie Withసూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో ప్రారంభమైంది. మహేష్‌, కీర్తి సురేశ్ లతో పాటు ఇతర తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. తాజాగా మహేష్‌ మరో ప్రాజక్ట్‌ మీద కూడా దృష్టి పెట్టినట్టు వార్తలొస్తున్నాయి.

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకి తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేష్‌బాబు కి బాగా నచ్చడంతో ఈ దర్శకురాలితో ఓ ప్రాజక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ నేపధ్యంలో మహేష్‌ ఇమేజ్ కి తగ్గట్టు పవర్ ఫుల్ సబ్జెక్టును సుధ కొంగర తయారుచేశారనీ, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనీ టాక్‌. ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తర్వాత సుధ కొంగర దర్శకత్వంలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu