పీవీపీకు వడ్డీతో సహా డబ్బులిచ్చిన మహేష్..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ డబ్బు విషయం వచ్చేసరికి ఆ బంధాలను పెద్దగా పట్టించుకోరు. లెక్కల్లో గనుక తేడాలొస్తే.. ఆ విషయం చాలా దూరం వెళ్లిపోతుంటుంది. అందుకే హీరోలు కూడా అడ్వాన్సులు తీసుకునేప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతతో ఖచ్చితంగా హీరో సినిమా చేయాల్సిందే..

ఆ సినిమా చేసే వరకు వేరే సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మహేష్ బాబు కూడా ఇలానే పీవీపీతో మరో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు. దానికో కారణం ఉంది. బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ కావడంతో పీవీపీ బయ్యర్లకు నష్టపరిహారాన్ని చెల్లించారు. మహేష్ కు కూడా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ డబ్బు మొత్తం పీవీపీ ఒక్కరే సర్ధుబాటు చేసినట్లు సమాచారం.

ఆ సమయంలో మీతో మరో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు మహేష్. అందరూ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను పీవీపీ నిర్మిస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ దిల్ రాజు, అశ్వనీదత్ ల చేతికి వెళ్లింది. దీంతో పీవీపీ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో మహేష్ తీసుకున్న అడ్వాన్స్ ను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.