అతనితో విబేధాలు లేవు!

బాలీవుడ్ లో ‘రబ్ నే బనాది జోడీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క శర్మ మెల్లమెల్లగా నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేస్తోంది. తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అనుష్క చాలా సినిమాల్లోనే నటించింది. ఆ సంస్థ ఆమెను మంచి బంధమే ఉంది. అయితే అనుష్క ఎప్పుడైతే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిందో.. అప్పటినుండి యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాకు అనుష్కకు మధ్య విబేధాలు తలెత్తాయనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలను ఖండించింది అనుష్క.

ఆ సంస్థ తనను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. అంతకాదు యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ బ్యానర్ కే నన్ను పరిమితం చేయాలని ఎప్పుడు అనుకోలేదని అనుష్క స్పష్టం చేసింది. నేను నిర్మాతగా మారాలనుకున్నప్పుడు ఆదిత్యకు ఫోన్ చేసి అతడి అనుమతి తీసుకోలేదు. మేము కలిసినప్పుడు మాత్రమే నా నిర్ణయం ఆయనకు చెప్పాను.. నా ఆలోచన బావుందని మెచ్చుకున్నారని వెల్లడించారు.