వెంకీ సర్ చాలా అద్భుతంగా చేశారు: మహేష్‌

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్ 2’ టీజర్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. టీజర్లో ఉన్న కామెడీ కంటెంట్ కు ప్రేక్షకులు బాగా కనెక్టైపోయారు. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర అందరినీ అలరిస్తోంది. తాజాగా సూపర్ స్థార్ మహేష్ బాబు కూడ టీజర్ చూసి వెంకీ సర్ చాలా అద్భుతంగా చేసారని, టీజర్ చాలా ఫన్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 12జనవరి న విడుదల కానుంది.