‘వాట్‌ ఎ టాలెంట్‌’ సితారా డాన్స్‌ చూసి మురిసిపోతున్న మహేశ్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితారా తన డాన్స్‌తో అదరగొట్టింది. తమ నివాసంలోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్‌ సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. తన గారాలపట్టి చిన్ని చిన్ని స్టెప్పులకు తడిసిముద్దయిన మహేష్‌ ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘వాట్‌ ఎ టాలెంట్‌’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సితారా డాన్స్‌ వీడియో వైరల్‌ అయింది. ఇదిలాఉండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ 25వ సినిమా ‘మహర్షి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.