HomeTelugu Newsఅనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ చేసిన మహేశ్‌

అనిల్ రావిపూడితో సినిమా కన్ఫర్మ్ చేసిన మహేశ్‌

7 6సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ ఫోన్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకొని మే 9 వ తేదీన రిలీజ్‌ కు సిద్ధం అవుతున్నది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండటంతో సినిమాను మే కు పోస్ట్ ఫోన్ చేశారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. మహేష్ 26 వ సినిమా సుకుమార్ తో చేయాల్సి ఉంది. రంగస్థలం తరువాత సుకుమార్ కు డిమాండ్ భారీగా పెరిగింది. గతంలో మహేశ్‌ తో చేసిన 1 నేనొక్కడినే సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు కథల విషయంలో మహేశ్‌ బాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుకుమార్ తో సినిమా అంటే స్క్రిప్ట్ అంత త్వరగా పూర్తికాదు. సినిమాను షూట్ చేయడం మొదలు పెడితే చాలా సమయం తీసుకుంటుంది. పైగా హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. దీంతో సుకుమార్ సినిమాను పక్కన పెట్టిన మహేశ్‌ అనిల్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. అనిల్ సినిమాను స్పీడ్ గా కంప్లీట్ చేస్తాడు. అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ అవుతుంది.

సుకుమార్ సినిమాను క్యాన్సిల్ చేసుకోవటానికి కారణం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2020 లో మహేష్ బాబు.. రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా ఉండబోతున్నది. ఈ సినిమా వరకు అన్నింటిని పూర్తి చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు మహేష్. అందుకే అనిల్ తో సినిమా చేసేందుకు మహేశ్‌ ఒకే చెప్పాడని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu