కళ్యాణ్‌ రామ్ ‘118’ మహేశ్‌ ట్వీట్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్ పటాస్‌తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన ‌.. అటుపై మళ్లీ సక్సెస్‌ లేక రేసులో వెనుకబడిపోయాడు. అయినా సరే పట్టువదల కుండా మరో కొత్త జానర్‌ను టచ్‌చేస్తూ.. ‘118’తో ఆడియన్స్‌ను పలకరించాడు.

థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సాధారణ ప్రేక్షకులనే కాదు అటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. సినిమా గురించి ట్వీట్ చేస్తున్నారు. ఈ జాబితాలో మహేశ్‌ కూడా చేరిపోయారు.

“118 సినిమా థ్రిల్లింగ్ ను కలిగించింది. గుహన్ సినిమాటోగ్రఫీ, దర్శకత్వం రెండు అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో నటించిన అందరికి అభినందనలు” అని ట్వీట్ చేశారు. మహేశ్‌ బాబు ట్వీట్ తో సినిమాకు మరింత మైలేజ్ వచ్చినట్టైంది. సినిమా బాగున్నా ప్రమోషన్ లేకుంటే ఈ కాలంలో థియేటర్స్ కు జనాలు రావడం లేదు.